Komati cheruvu
-
Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పర్యాటకులకు ఇక పండగే (ఫొటోలు)
-
Photo Story: తీగల వంతెన.. మబ్బులు అందేనా!
సిద్దిపేట: ఆకాశంలో దోబూచులాడుతున్న కారు మబ్బులు.. నిండుకుండలా ఉన్న చెరువుపై వేలాడుతున్న తీగల వంతెన.. ఈ చిత్రం చూపురులను కట్టిపడేస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలకు ప్రజలను అనుమతిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సస్సెన్షన్ బ్రిడ్జ్ కారుమబ్బుల నేపథ్యంలో ఇలా అందాలను చిందించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట అటవీప్రాంతంలో మంచెపై ఐసోలేషన్‌లో ఉన్న గిరిజనుడు గూడెంలో కోవిడ్ గడబిడ మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెంలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ 36 కుటుంబాలు, 174 మంది జనాభా ఉన్నారు. కొందరు గిరిజనులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసి వైద్యసిబ్బంది మూడు రోజుల క్రితం గూడేనికి వెళ్లి వైద్యపరీక్షలు చేయగా నలుగురికీ పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలున్న కొంతమంది నాటుమందులు వాడుతూ అటవీప్రాంతంలోని పంటపొలాల్లో మంచెలు, డేరాలలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా లక్షణాలున్న మరో 50మందికి వైద్యసిబ్బంది కిట్లను అందజేశారు. గూడెంవాసులు కరోనా పరీక్షలకు సహకరించట్లేదని జిల్లా మండల వైద్యాధికారి గోపీనాథ్ తెలిపారు. సాగు బడిలో బడి పాఠం పత్తి పంటలో కలుపు తీస్తూ పిల్లల పనులు ఓ వైపు... మరోవైపు పనుల్లో మునిగి తేలుతూ ఫోన్లో స్పీకర్ ఆన్ చేసుకొని బడి పాటాలు వింటూ చకచకా చిట్టి చేతులతో కొంకలు పట్టి పనుల్ని పరుగులు పెటించారు చిన్నారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లి గ్రామ çశివారు పత్తి పంటలో బడి పాఠాలు వింటూ పనులు చేస్తున్న పిల్లలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కొమటిచెరువులో అదిరిపోయిన లేక్ ఫెస్టివల్ ఫోటోలు
-
ఉగాది సందర్భంగా ఘనంగా లేక్ ఫెస్టివల్ .. ఎక్కడంటే!
సాక్షి, సిద్దిపేటజోన్: ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు (మినీ ట్యాంక్‌బండ్)పై నేటి నుంచి ప్రారంభించనున్న లేక్ ఫెస్టివల్ (కోమటి చెరువు మహోత్సవం)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మున్సిపల్, పర్యాటకశాఖ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 12న ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద గ్లో గార్డెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందులో వన్యప్రాణుల ప్రతిమలు, వివిధ రకాల కృత్రిమ వృక్షాలను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం వద్దనున్న మ్యూజికల్ ఫౌంటైన్ తరహాలో కోమటి చెరువుపైన ఓ ఫౌంటైన్‌ను 13న ప్రారంభించనున్నారు. 14న తెలంగాణ కళాకారులు, కవులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ లేక్ ఫెస్టివల్‌కు కోమటి చెరువుపైన ఉన్న నెక్లెస్‌రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, అడ్వెంచర్ పార్క్, రాక్గార్డెన్లతో పాటు చెరువును విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. -
మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..
సాక్షి, సిద్దిపేట: పట్టణంలో పర్యటించిన మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డిలు ఆదివారం రాత్రి మినీ ట్యాంక్‌బండ్ కోమటి చెరువు వద్ద సరదాగా కాలక్షేపం చేశారు. ముందుగా రాక్ గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం కోమటి చెరువు కట్టపైన బ్యాటరీ బైక్‌లో మంత్రి హరీశ్‌తో కలిసి విహరించారు. అదేవిధంగా చెరువులో మంత్రులు బోటింగ్ చేశారు. చెరువుకట్టపైన సరదాగా పానీపూరి తిని కొద్దిసేపు మినీట్యాంక్‌బండ్ పై సేదతీరారు. హుస్సేన్ సాగర్ తరహాలో కోమటి చెరువును తీర్చిదిద్దడం పట్ల మంత్రి హరీశ్‌రావును ఆయన అభినందించారు. -
సిద్దిపేటకు నెక్లెస్ రోడ్డు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువుపై ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేటలో నిర్మించనున్న ఈ రోడ్డు నిర్మాణంపై ప్రముఖ అర్కిటెక్ట్ సంవాద్ ప్రధాన్ రూపొందించిన విజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆయన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా అదికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కలిగేలా విజన్‌కు అనుగుణంగా నిర్మాణం ఉండాలని, తన డ్రీమ్ ప్రాజెక్టుపై రూపకల్పన చేసి, సిద్దిపేట నెక్లెస్ రోడ్డు అంటే రోల్ మోడల్‌గా నిలిచేలా ఉండాలని అధికారిక వర్గాలను ఆదేశించారు. కలెక్టర్‌తో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నెలలోపు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజెంటేషన్‌లో చిన్నా, పెద్దలకు సరదాగా గడిపేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని, అక్కడక్కడా ఎత్తు వంపులతో మంచి అనుభూతి కలిగించేలా ఉండాలన్నారు. నెక్లెస్ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏ,బీ,సీ,డీ,ఈ జోన్లుగా విభజించనున్నామన్నారు. చెరువు కట్ట కిలోమీటర్ ఉండగా, నిర్మించే నెక్లెస్ రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్ ఉండనుందన్నారు. అదేవిదంగా పాత, కొత్త కట్టలను కలుపుతూ రెండున్నర కిలోమీటర్లు రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును రూ.25 కోట్లతో నిర్మించనున్నట్లు, మొదటగా సీ, డీ జోన్ల పనులు యుద్ధప్రాతిపాదికన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లక్ష్మణ్, మున్సిపల్ ఇంజనీర్లు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కోమటిచెరువు పర్యాటక కళ
బోటింగ్‌తో సందడి చేసిన సందర్శకులు సిద్దిపేట జోన్: పట్టణ శివారులోని కోమటి చెరువును సందర్శించేందుకు ఆదివారం పర్యటకులు పోటెత్తారు. ప్రతి ఆదివారం సిద్దిపేటతో పాటు పట్టణ సమీప గ్రామాల ఉద్యోగులు, ప్రజలు కాలక్షేపం కోసం కోమటి చెరువును సందర్శిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో కోమటి చెరువులో నీటిమట్టం పెరగడం, కట్ట ఆధునీకరణలో భాగంగా చెరువు శివారులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిల్ర్డన్స్ పార్కు , షికారు కోసం బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు చెరువుకు తరలివచ్చి బోటింగ్ చేసేందుకు ఉత్సాహం చూపించారు. -
ఇంత జాప్యమెందుకు?
రెండేళ్లయినా చాలదా? కోమటి చెరువు పనులపై కాంట్రాక్టర్‌పై మండిపడ్డ మంత్రి సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు చెరువులు, కుంటల పరిశీలన కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచన సిద్దిపేట జోన్: పట్టణ శివారులోని కోమటి చెరువు ఆధునికీకరణ పనుల్లో జాప్యంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులపై మండిపడ్డారు. మినీట్యాంక్ బండ్ తరహాలో ఆధునికీకరించే క్రమంలో నిధుల మంజూరు చేసి రెండేళ్లు గడిచినా పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని చెరువుల స్థితిగతులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటి చెరువు, ఎర్రచెరువు, చింతల చెరువులను అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా కోమటి చెరువుకు చేరుకున్న మంత్రి అక్కడ జరుగుతున్న పనుల జాప్యంపై నీటి పారుదల, టూరిజం, మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. చెరువు కట్టపై వర్షపు నీరు నిల్చి ఉండడం, పిల్లల పార్కులో గుంతలు ఏర్పడడం, కట్టపైన ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ టైల్స్, బండల మధ్య పొదలు పెరగడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను పిలిచి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు కావాలని కాంట్రాక్టర్ కోరడంతో విస్మయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది బతుకమ్మ పండుగ నాటికే పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేపట్టాలని చెప్పినా.. మళ్లీ బతుకమ్మ పండుగ వస్తుందన్నారు. సమయం ఎంత ఇచ్చినా సరిపోదు, మరో రెండేళ్లయినా చాలదంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న నీటి పారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణచారి, ఓఎస్డీ బాల్‌రాజుతో మంత్రి మాట్లాడుతూ.. బుధవారం ఆయా శాఖల ముఖ్య అధికారులు సిద్దిపేటకు వస్తారని పనులను వేగవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని, బతుకమ్మ పండుగ నాటికి పూర్తి స్థాయిలో పనులు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కోమటి చెరువు పరిసరాల్లో శిల్పారామం తరహాలో నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. చెరువుపై రోప్ వే ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నాసర్‌పురా కప్పల కుంటలో భారీ గుంతలు తీయడంపై ఆరా తీశారు. చింతల చెరువు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా రంగధాంపల్లి చౌరస్తా, ఎంపీడీఓ చౌరస్తాకు చేరుకొని బాబూ జగ్జీవన్‌రామ్ కూడలి ఆధునికీకరణపై అధికారులతో సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. ఫుట్‌పాత్ పనులను పరిశీలించారు. దసరా రోజు సీఎం సిద్దిపేటకు వస్తున్నారని, పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, బ్రహ్మం, ప్రవీణ్, తాళ్లపల్లి సత్యనారాయణ, అధికారులు నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, యాదగిరి తదితరులు ఉన్నారు. -
‘వరద కాలువ’ పూర్తయ్యేదెన్నడో?
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట కోమటిచెరువు నుంచి నర్సాపూర్ ఊర చెరువు వరకు వరద కాలువ నిర్మాణం ఓ పట్టాన పూర్తవడంలేదు. శాశ్వత ప్రాతిపదికన తలపెట్టిన కట్టడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడంలో ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. పనుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించడం సిద్దిపేట డివిజన్ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ(ఐఅండ్‌సీఏడీ)కు సవాల్‌గా మారింది. సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్.. పట్టణంలోనే విస్తారమైన ఉనికిగలది. కొత్త బస్టాండ్-కోమటిచెరువు మధ్యలోని నిర్దేశిత ఏరియా.. దశాబ్దం కిందట వర్షాలూ.. వరదలతో ముంపునకు గురైంది. భవిష్యత్తులో అలాంటి దుస్థితి ఉత్పన్నం కావొద్దన్న ఉద్దేశంతో వరద కాలువ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని 2007లో నిర్ణయించారు. వాన, వరద నీరు ఆవాసాల చెంతన నిలువకుండానూ చిన్ననీటి వనరులకు తోడ్పాటుగానూ ఉండాలని ఆలోచించారు. దానికి ఉభయతారకమే ఫ్లడ్ ఫ్లో కెనాల్(వరద కాలువ)గా నిశ్చయించారు. ఆ క్రమంలోనే ఐఅండ్‌సీఏడీ రూ.1.23 కోట్లను కేటాయిస్తూ 2007 ఆగస్టు 21న ఉత్తర్వుచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదిరింది. కాలువ మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో రెండు వైపుల్లోనూ సిమెంట్ కాంక్రీట్ గోడల్ని 600 మీటర్ల మేర(సున్నా నుంచి 30వ గొలుసు వరకు) కట్టించారు. రెండో విడత గోసగోస ఎంచుకున్న ప్రాజెక్టు తొలి దఫాతో పూర్తవలేదు. అందుకే రెండో దఫాలో మిగతాది (30 నుంచి 76వ గొలుసు దాకా) సంపూర్ణం చేయాలని నిర్ణయించారు. ఈసారి రెండింతలకు పైగానే అంచనా వ్యయంగా లెక్కలేశారు. ఆ ప్రకారం రూ.3.07 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. దానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు 2012 మార్చి 6న జీఓ ఇస్తూ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. అదే వరుసలో హైదరాబాద్‌కు చెందిన మరో కాంట్రాక్టు సంస్థ పనులను దక్కించుకొంది. కానీ..ఈసారి నిర్మాణానికి వివాదాలు ముసురుకున్నాయి. పరిహారం కోరుతూ కోర్టుకు... తమ జాగాల్లోంచి కాలువ నిర్మాణాలు చేపట్టరాదని, ఒక వేళ అనివార్యమైతే పరిహారం ఇప్పించాలంటూ పలువురు హైకోర్టుకెళ్లారు. అలా తొమ్మిది కేసులు దాఖలయ్యాయి. సుమారు 70 మంది వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఎక్కడైతే వివాదం లేదో అక్కడ యంత్రాలతో కాలువను తవ్విస్తూ సీసీ(సిమెంట్ కాంక్రీట్) గోడల్ని ఆ డిపార్టుమెంటు కట్టించింది. దీంతో అది కాస్తా ప్యాచ్ వర్కు మాదిరిగా అవతరించింది. అలా 40 శాతం వరకు లాక్కొచ్చారు. పని విలువను బట్టి దాదాపు రూ.1.20 కోట్లు కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. గత జూన్ నుంచి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివాదాలు సమసిన వెంటనే... మొన్నటిదాకా వర్షాల కారణంగానూ మరో వైపు కోర్టు కేసుల వల్లనూ వరద కాలువ పనులు ఆగాయి. ప్రస్తు తం నెలకొన్న వివాదాలు సమసిన వెంటనే నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తాం. ఈ పనుల కారణంగా ఎవరికీ పరిహారం ఇచ్చే వెసులుబాటు శాఖాపరంగా లేదు. -కేఎన్ ఆనంద్, ఈఈ, నీటి పారుదల శాఖ, సిద్దిపేట