కేబుల్‌ బ్రిడ్జిపై బిగ్‌బాస్‌ చూస్తున్నాడు జాగ్రత్త! | Traffic Police Social Awareness On Durgam Cheruvu Cable Bridge | Sakshi
Sakshi News home page

కేబుల్‌ బ్రిడ్జిపై బిగ్‌బాస్‌ చూస్తున్నాడు జాగ్రత్త!

Oct 3 2020 7:24 PM | Updated on Oct 3 2020 9:13 PM

Traffic Police Social Awareness On Durgam Cheruvu Cable Bridge - Sakshi

అయినప్పటికీ కొందరి తీరు మారకపోవడంతో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడని, ఇకనైనా మారండని అంటున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి అనవసరంగా చలానాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్నారు. ఆకట్టుకుంటున్న లైటింగ్స్‌ ధగధగల్లో ఫొటోలు, సెల్ఫీలతో మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో వంతెనపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. వాహన ప్రమాదాలకు అవకాశాలున్నాయి. దీనిపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వంతెనపై వాహనాలు నిలపకుండా నిషేదం విధించారు. 

అయినప్పటికీ కొందరి తీరు మారకపోవడంతో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడని, ఇకనైనా మారండని అంటున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి అనవసరంగా చలానాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక పర్యాటకుల రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతనెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా కేబుల్‌ బ్రిడ్జి్‌ ప్రారంభమైంది. 
(చదవండి: ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement