హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహ్మ, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటే వరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన 23 మందికి చలానా విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment