
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ డైరెక్షన్‌లో చేసిన 'ఆర్య' సినిమాతో బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు వచ్చింది. ఇక అదే డైరెక్టర్‌తో చేస్తున్న 'పుష్ప'తో బన్నీకి ఐకాన్ స్టార్ అన్న కొత్త పేరొచ్చింది. ఇక పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది చిత్రయూనిట్. ఇందులో ఎర్రచందనాన్ని లారీలో లోడ్ నింపుతూ, అడ్డొచ్చినవారిని చితకబాదుతూ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు బన్నీ. అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్‌లో చూసి విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ రోజు హీరో బర్త్‌డే కావడంతో రచ్చరచ్చ చేస్తున్నారు. అటు చిత్రయూనిట్ కూడా అతడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది.
అందులో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద లేజర్, లైట్ షో ఉంటుందని ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్ షో ఉంటుందని వెల్లడించింది. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్‌కు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. హీరో బర్త్‌డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప టీజర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment