Allu Arjun Pushpa 2 Movie Pooja Ceremony Will Start On August 22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు.. ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఓ స్వాగ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా సమంత గ్లామర్, తనతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్, ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఎదురు చూసేది 'పుష్ప 2' కోసమే. ఆ సినిమాను అప్పుడు స్టార్ట్ చేస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా అందులో విలన్‌గా ఆ స్టార్ హీరోలు, ఈ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని అని ప్రచారం జరిగింది. మరోవైపు అసలు స్క్రిప్టే పూర్తి కాలేదు అని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి తెర దించుతూ 'పుష్ప: ది రూల్'ను స్టార్ట్ చేయనున్నాడు సుకుమార్.
చదవండి: పాపం హిందీ హీరోలు!.. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్
సోమవారం అంటే ఆగస్టు 22న 'పుష్ప 2: ది రూల్' పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆగస్టు 22నే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది.
చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
After September 15th...
— Sarath Chandra Naidu (@imsarathchandra) August 21, 2022
Comments
Please login to add a commentAdd a comment