Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment On CBN Revanth Banakacherla Drama1
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?

రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి​ గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్‌ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్‌ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్‌, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్‌ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్‌ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్‌ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Strong Earthquake Tremors Felt in Delhi2
ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు

న్యూఢిల్లీ: దేశారాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని క్షణాలపాటు బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రత నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో భూకంప తీవ్రత కనిపించింది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపాన్ని గుర్తించినంతనే జనం భయాందోళనలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే జనం రోజువారీ కార్యకలాపాల్లో మునిగివున్న సమమంలో ఈ భూకంపం సంభవించింది. #WATCH | An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9.04 am IST. Strong tremors felt in Delhi-NCR. A man in Ghaziabad, UP says, "...I had woken up just at the time when there was a jolt. I was scared. There was another earthquake… pic.twitter.com/YHDyGq7Oaa— ANI (@ANI) July 10, 2025ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. జనం భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది.జజ్జర్‌లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌)తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం జజ్జర్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. #earthquakeOnly elvish Bhai can save Delhi ncr from Earth quake ☠️❤️‍🔥😭👀 pic.twitter.com/TQTqSqtAbI— Yash Pratap (@yash_pst) July 10, 2025

Welcome to Afghanistan Most Bizarre Tourism Video Ever3
అమెరికా.. మీకు ఇదే మా సందేశం: తాలిబన్లు

మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్‌కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓపెన్‌ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అఫ్గన్‌ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్‌ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్‌ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్‌ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్‌ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..అఫ్గనిస్తాన్‌ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్‌కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్‌ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్‌టైజ్‌మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు. The Taliban has released a tourism appeal video aimed at attracting American visitorsTheir message to Americans:"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు. ఇంతకీ అఫ్గన్‌ నేలపై ఏమున్నాయి.. కాబూల్ (Kabul) అఫ్గన్‌ రాజధాని నగరం. గార్డెన్స్‌ ఆఫ్‌ బాబర్‌, దారుల్‌ అమల్‌ ప్యాలెస్‌, నేషనల్‌ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి. దారుల్‌ అమల్‌ ప్యాలెస్‌హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్‌ సిటాడెల్‌ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్‌లో మొట్టమొదటి నేషనల్ పార్క్.పంజ్‌షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.బిజినెస్‌ ఇన్‌సైడర్‌ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్‌ ఈస్ట్‌కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్‌ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్‌ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు.

Gavaskar Reveals Who Bumrah Should Replace in 3rd Test Vs Eng at Lords4
IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు

ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా (Ind vs Eng) సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి టెస్టు మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించగా.. భారత్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) రావడం లాంఛనమే.అయితే, బుమ్రా రాక వల్ల ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తుండగా.. టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఈ విషయంపై స్పందించాడు. ప్రసిద్‌ కృష్ణ (Prasidh Krishna)ను జట్టు నుంచి తప్పించడం ఖాయమేనని స్పష్టం చేశాడు. కాగా లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక​ విజయం సాధించిన విషయం తెలిసిందే.1-1తో సమంఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌ దీప్‌ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తంగా పది వికెట్లు కూల్చి భారత్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇక సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సైతం ఏడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్‌ కృష్ణ మాత్రం కేవలం ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టగలిగాడు. పేస్‌ దళంలో అతడొక్కడే ఇలా పూర్తిగా నిరాశపరిచాడు. బర్మింగ్‌హామ్‌లో మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ కర్ణాటక పేసర్‌.. 111 పరుగులు ఇచ్చుకున్నాడు.ప్రసిద్‌ కృష్ణపై వేటుపడక తప్పదుఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. బుమ్రా రాక కారణంగా ప్రసిద్‌ కృష్ణపై వేటుపడకతప్పదు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.లీడ్స్‌లోనూ అంతే. వికెట్లు తీసినప్పటికీ జట్టుకు పెద్దగా ఉపయోగపడే ప్రదర్శన చేయలేదు’’ అని పేర్కొన్నాడు. కాబట్టి మేనేజ్‌మెంట్‌ అతడికి మరో అవకాశం ఇవ్వదని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. పచ్చికతో కూడుకున్న లార్డ్స్ పిచ్‌ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించనుందన్న విశ్లేషణల నడుమ.. నలుగురు ఫ్రంట్‌లైన్‌ పేసర్లతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లతో పాటు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి రూపంలో ఈ మేరకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పిచ్‌ స్వభావాన్ని బట్టి తాము 3+1 లేదంటే 3+2 కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వెల్లడించాడు.మూడో టెస్టుకు భారత తుదిజట్టు అంచనాశుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్‌ సిరాజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.ఇంగ్లండ్‌ తుదిజట్టుబెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్), జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్‌ వోక్స్, బ్రైడన్‌ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్‌ బషీర్‌.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్‌ గడ్డపై తొలి సిరీస్‌ కైవసం

Baahubali The Beginning Movie Celebrates 10 Years5
'బాహుబలి'కి పదేళ్లు.. ఈ కథకు ఆదర్శం ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను ఈ చిత్రం సృష్టించింది. తొలిభాగం 2015 జులై 10న విడుదలైంది. రెండోది 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. సరిగ్గా నేటితో పదేళ్లు బాహుబలి పూర్తి చేసుకున్నాడు. బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం విడుదల తర్వాత తెలుగు పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది.బాహుబలికి మూలం'అమరేంద్ర బాహుబలి పాత్రను రామాయణం నుంచి తీసుకున్నదేనిని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు. శ్రీ రాముడిలో ఉండే లక్షణాలు బాహుబలి పాత్రలో కనిపిస్తాయన్నారు. రామాయణం గురించి తెలుసుకుంటే రాముడు చాలా వినయంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆవేశంగా మాట్లాడరు. ఎప్పుడో ఒకసారి మాట్లాడినా దాని వెనుక పెద్ద ప్రళయమే ఉంటుంది. ఆయన పెద్దలు చెప్పింది వింటూ తన పనులు చేసుకుంటూ వెళ్లిపోతాడు. అంత బలంగా రాముడి చరిత్ర మనకు చెబుతుంది. భారత్‌లో కృష్ణుడికి ఒక గుడి ఉంటే.. 50కి పైగా రాముడి ఆలయాలు ఉంటాయి. పొరపాటున రాముడిని ఏమైనా అంటే భారతీయులు ఎంతమాత్రం సహించరు. ప్రతి ఒక్కరిలో ఆవేశం పొంగుకుని వస్తుంది. అంతలా భక్తితో ఆయన్ను ఆరాధిస్తారు. అంత భక్తిభావన ఎందుకు ఉంది అని ఆలోచించా.. రాముడి గురించి తెలుసుకున్న తర్వాతే బాహుబలి పాత్రను తెరపైకి తీసుకొచ్చాను.' అని రాజమౌళి అన్నారు.'వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడితో పాటు మరికొన్ని పవర్‌ఫుల్‌ పాత్రలు ఉంటాయి. హనుమంతుడు, లక్ష్మణుడు వంటి పాత్రలను కూడా రామాయణంలో చాలా బలంగా రాశారు. అయితే, వారు రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు అయినా రెడీగా ఉంటారు. అలా డైరెక్ట్‌ హీరోయిజం కాకుండా అప్లయిడ్‌ హీరోయిజాన్ని రాముడి పట్ల వాల్మీకి చూపించారని నాకు అనిపించింది. అందుకే అమరేంద్ర బాహుబలి పాత్ర రాముడిలా కనిపిస్తుంది. కట్టప్ప, శివగామి, దేవసేన వంటి పాత్రలు బాహుబలిని దేవుడు అంటాయి.' అన్నారు.బాహుబలి విశేషాలుజాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులను బాహుబలి -1 అందుకుంది.బాహుబలి-1 మూవీ 14 నంది అవార్డ్స్‌ను దక్కించుకుంది.బాహుబలి -2 సినిమాకు 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మూడు విభాగాల్లో నేషనల్‌ అవార్డులు గెలుచుకుంది. (ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ యాక్షన్ చిత్రం)బాహుబలి -2 మూవీలోని 'నాటు నాటు' సాంగ్‌ ఆస్కార్‌ అవార్డ్‌ అందుకుంది.బాహుబలి- 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టి రెండో స్థానంలో ఉంది.భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది.ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు.ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపోదించారు2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ని బాహుబలిగా ప్రకటించారు.శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగిందిఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. అందుకోసం 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు.ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది

Iran hints Trump may be hit by drone while sunbathing6
ట్రంప్‌ టార్గెట్‌గా ఇరాన్‌ భారీ ప్లాన్‌.. సన్‌బాత్‌ సమయంలో డ్రోన్‌తో దాడికి..

టెహ్రాన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్‌ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్‌ ట్రంప్‌ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇరాన్‌ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మరోవైపు.. ఇరాన్‌ వ్యాఖ్యలకు ట్రంప్‌ సెటైరికల్‌ కౌంటరివ్వడం గమనార్హం.ఇటీవల ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్‌, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌ హెచ్చరించారు. ఇక, తాజాగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్‌ లారిజాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్‌-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్‌ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్‌ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్‌ టాప్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.Larijani: "We can target Trump's navel!"Javad Larijani, in a televised program, said:"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025ట్రంప్‌ కౌంటర్‌.. ఇరాన్‌ అధికారి లారిజాని వ్యాఖ్యలపై ట్రంప్‌ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్‌ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నా. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్‌.. మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారు అని విలేకరి అడగ్గా.. ట్రంప్‌ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని సమాధానం ఇచ్చారు. సన్‌బాత్‌ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బ్లడ్‌ పాక్ట్‌ క్రౌడ్‌ ఫండింగ్‌..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ట్రంప్‌ టార్గెట్‌గా చాలా విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని టార్గెట్‌ చేసిన వారిపై బ్లడ్‌ పాక్ట్‌ అనే ప్లాట్‌ఫామ్‌ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం. ట్రంప్‌నకు బౌంటీ ఇవ్వాలని బ్లడ్‌ పాక్ట్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. ఇది జులై 8 నాటికి ఇది 27 మిలియన్‌ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది.

No bride, no groom, just vibes: Fake weddings are the Trend7
పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!

వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా? అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్‌లోకి వస్తే... ‘ఫేక్‌ వెడ్డింగ్‌’ అనేది యువతరంలో ఒక ట్రెండ్‌గా మారింది. మెట్రో సిటీస్‌లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్‌ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్‌) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్‌ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్‌లలో, రూఫ్‌టాప్‌ బార్‌లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్‌ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేషన్‌ కోసం ఈ ఫేక్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్‌ ట్రెండ్‌ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్శిటీలో ఫేక్‌ వెడ్డింగ్‌ ఈవెంట్‌ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్‌ వెడ్డింగ్‌ ట్రెండ్‌పై సోషల్‌ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.

ClearTax AI Filing ITR with new Telugu enabled AI assistant8
తెలుగులోనూ ట్యాక్స్‌ ఫైలింగ్‌

ఫిన్‌టెక్‌ సంస్థ క్లియర్‌ట్యాక్స్‌ తాజాగా ఐటీ రిటర్నులను ఫైలింగ్‌ చేసేందుకు సంబంధించి తెలుగు తదితర 7 భాషల్లో సహాయం పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహు భాషల్లో పని చేసే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత క్లియర్‌ట్యాక్స్‌ ఏఐ అసిస్టెంట్‌ను ఆవిష్కరించింది. దీనితో వాట్సాప్, స్లాక్‌ తదితర మాధ్యమాల ద్వారా తమకు కావాల్సిన భాషలో చాటింగ్‌ చేస్తూ, మూడు నిమిషాల వ్యవధిలోనే ఫైలింగ్‌ చేయొచ్చని సంస్థ వివరించింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఫైల్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీనితో కొత్తగా 1 కోటి మంది ట్యాక్స్‌ ఫైలర్లను వ్యవస్థ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్‌ఐటీఆర్‌ కొత్త నిబంధనలు..కఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్‌ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్‌ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్‌ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్‌తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్‌ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్‌లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్‌లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్‌లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు.

Donald Trump says us will Charge Brazil with 50 Tariff9
‘మాజీ అధ్యక్షుణ్ణి అవమానిస్తారా?’.. బ్రెజిల్‌కు ట్రంప్‌ సుంకాల షాక్‌

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతు పలుకుతూ, ఆ దేశానికి 50 శాతం భారీ సుంకాన్ని ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై విమర్శలు గుప్పించారు. ఇది అంతర్జాతీయ అవమానంగా అభివర్ణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్‌ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించవద్దని కోరారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై వాషింగ్టన్ దర్యాప్తు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. భారత్‌ మాదిరిగానే బ్రెజిల్ ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశం.బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తనకు బాగా తెలుసని, ఆయనతో కలిసి తాను పనిచేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు ఆయనను ఎంతో గౌరవంగా చూశారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ అనుసరిస్తున్న విధానం అవమానకరమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన విమర్శలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా స్పందించిన దరిమిలా ట్రంప్ భారీ సుంకాలతో బ్రెజిల్‌కు షాకిచ్చారు.బ్రెజిల్‌ ప్రస్తుత అధ్యక్షుడు లూలా నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బోల్సోనారో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. అయితే సైన్యం నుంచి ఆయనకు మద్దతు అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని చెబుతారు. అయితే బోల్సోనారో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా ఆగస్టు ఒకటి నుంచి బ్రెజిలియన్ వస్తువులపై 50 శాతం అమెరికా సుంకం అమల్లోకి వస్తుందని, ఇతర ఆర్థిక వ్యవస్థల గడువుకు ఇది సమానమని ట్రంప్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రస్తుతం తమ దేశ వాణిజ్య భాగస్వాములకు లేఖలు జారీ చేస్తున్నారు. అధిక సుంకాల జాబితాలో గతంలో బ్రెజిల్ లేదు.

BJP suggests Arvind Kejriwal deserves Nobel prize corruption category10
కేజ్రీవాల్‌కు నోబెల్‌ ఇవ్వాల్సిందే.. ఏ కేటగిరి అంటే.. బీజేపీ సెటైర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోదాలో వీకే సక్సెనా తరచూ తమ పరిపాలనకు అడ్డు తగులుతున్నాసరే విజయవంతంగా ప్రభుత్వపాలన కొనసాగించినందుకుగాను తాను కూడా నోబెల్‌ బహుమతికి అర్హుడినేనని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. అవినీతి, అసమర్థత కేటగిరిలో నోబెల్‌ ఉంటే కేజ్రీవాల్‌కు అవార్డు వచ్చేందని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు.ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నోబెల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. అసమర్థత, అరాచకం, అవినీతికి సంబంధించిన కేటగిరిలో నోబెల్‌ ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా ఒక అవార్డు లభించేది అని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో ఆప్ పాలనలో జరిగిన అక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సులలో పానిక్ బటన్లు, తరగతి గది నిర్మాణం, మహిళలకు పెన్షన్ పథకాలు, మద్యం లైసెన్సింగ్, షీష్ మహల్ గురించి వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆప్‌ నేతలు తిరిగి కౌంటరిచ్చారు. సచ్‌దేవా వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ..‘వీరేంద్ర సచ్‌దేవా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కేవలం మాట్లాడటం కాదు. పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాల రోజులు ముగిశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఆప్‌ హయాంలో పాఠశాలలు నిర్మించాం. ఆసుపత్రుల్లో వసతులను మెరుచుపరిచాం. ఉచిత విద్యుత్‌ ఇచ్చాం. అవినీతిని అరికట్టాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులే దోచుకుంటున్నారు’ అని ఆరోపించారు.కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్‌ కేజ్రీవాల్‌ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్‌ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లను ఆప్‌ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్‌కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్‌లను కూల్చివేశారు. వారికి ఏం లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్‌లను కూల్చివేసింది’ అని అన్నారు.మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement