
ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్ప సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందని చాలా సార్లు వార్తలొచ్చాయి. వీటిపై డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ కూడా ఇచ్చారు. పుష్ప-2 రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు.
ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సుకుమార్. 'పుష్ప రాజ్ రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్' అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో వాయిదా అంటూ రూమర్స్ వైరలవుతున్న వేళ మరోసారి క్లారిటీ ఇచ్చిపడేశారు. తాజాగా డైరెక్టర్ చేసిన పోస్ట్‌తో పుష్ప-2పై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పడినట్లే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. గతేడాది ఎవరూ ఊహించని విధంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టు కావడంతో అనుకున్న సమయంలో సినిమా విడుదల కాకపోవచ్చనే వార్త ప్రచారం జరిగింది.
గతంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్'2021లో విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇందులో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్-2లో ఆయన ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్ ఉంది. పార్ట్-1కు వచ్చిన ఆదరణ చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్- 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
200 DAYS for Pushpa Raj to begin his RULE 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#PushpaKaRuleIn200Days 💥💥
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/RxUDlkdrpB— Mythri Movie Makers (@MythriOfficial) January 29, 2024