Pushpa 2: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్! | Mythri Movie Makers Released Allu Arjun Pushpa 2 Movie Special Poster Released As New Year Special - Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Special Poster: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Published Mon, Jan 1 2024 2:48 PM | Last Updated on Mon, Jan 1 2024 3:38 PM

Mythri Movie Makers Released Pushpa Special Poster On New Year - Sakshi

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. 

పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్(పార్ట్-2) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్‌ చేశారు. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement