Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్‌డేట్‌.. గూస్‌బంప్స్‌ ఖాయమేనా? | Allu Arjun Pushpa 2: The Rule Teaser Release Date Revealed - Sakshi
Sakshi News home page

Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్‌డేట్‌.. పుష్పరాజ్ గూస్‌బంప్స్‌ ఎప్పుడంటే?

Published Sun, Apr 7 2024 4:26 PM | Last Updated on Sun, Apr 7 2024 6:31 PM

Allu Arjun Pushpa 2 The Rule Teaser Update From Makers - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో సీక్వెల్‌గా  ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో పుష్ప-2 షూటింగ్‌ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ ‍అప్‌డేట్‌ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌ డే కావడంతో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ పుష్ప-2 టీజర్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా టీజర్‌ టైమింగ్‌ను రివీల్‌ చేశారు మేకర్స్. బన్నీ బర్త్‌ డే రోజున 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా గూస్‌ బంప్స్‌ గ్యారంటీడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement