అహ్మదాబాద్: మోర్బి వంతెన పునర్నిర్మాణ పనులపై గుజరాత్ పోలీసు శాఖ విచారణలో కళ్లు తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎటువంటి అనుభవం లేని అజంతా– ఓరెవా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. అది కేవలం వంతెన కేబుళ్లకు రంగులు, పాలిష్ వేసి హడావుడిగా ప్రారంభించేసింది.
నాసిరకమైన బరువైన మెటీరియల్ వాడకం ఒక దుర్ఘటనకు కారణమైంది. పనులు చేసిన సిబ్బందికి వేలాడే వంతెనకు సంబంధించిన ఎలాంటి పరిజ్ఞానమూ లేదని తేలింది. పనులపై ఆడిట్ జరగలేదు. నిపుణుల పర్యవేక్షణా లేదు. తుప్పుపట్టిన పాత కేబుళ్ల స్థానంలో కొత్తవి వేయకపోవడం, సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతించడం ఘోరానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment