మాస్కో: గుజరాత్ మొర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద దుర్ఘటన.. దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృతుల సంఖ్య 141కి చేరుకోగా.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఘటనాస్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది.
మొర్బి కేబుల్ బ్రిడ్జి ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధానిలను ఉద్దేశిస్తూ.. ఈ మేరకు పుతిన్ సంతాప ప్రకటనగా క్రెమ్లిన్ ఒక సందేశం విడుదల చేసింది. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
ఇదిలా ఉంటే.. స్వరాష్ట్రంలో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వాళ్లకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడ్డ వాళ్లకు రూ.50వేలు పరిహారం ప్రకటించింది.
Here is the authentic CCTV footage of the Morbi bridge collapse: NOT the old videos that are being made viral to blame the public. Yes, bridge is crowded but to blame crowds would be to shun responsibility for multiple level failures of those involved in ensuring safety. pic.twitter.com/6wVA0xddXl
— Rajdeep Sardesai (@sardesairajdeep) October 31, 2022
Comments
Please login to add a commentAdd a comment