కేబుల్‌ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే.. | TS Police Says Fine For Parking Vehicles On Cable Bridge | Sakshi
Sakshi News home page

కేబుల్‌ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..

Published Tue, Aug 8 2023 9:03 PM | Last Updated on Tue, Aug 8 2023 9:15 PM

TS Police Says Fine For Parking Vehicles On Cable Bridge - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: వాహనదారులను సైబరాబాద్‌ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్‌ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్‌ చేస్తే 9490617346 అనే నెంబ‌ర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. 

వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా, ప్ర‌మాదాల‌ను నిలువ‌రించేందుకు సైబ‌రాబాద్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహ‌నాల‌ను పార్కింగ్ చేయ‌రాద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. పార్కింగ్ చేసిన వాహ‌నాల‌కు భారీ జ‌రిమానా విధిస్తామ‌ని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వ‌ద్ద వాహ‌నాల‌ను పార్క్ చేయ‌డం వ‌ల్ల ఇత‌ర వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతుంద‌న్నారు. అక్ర‌మంగా వాహ‌నాల‌ను పార్కింగ్ చేస్తే భారీ జ‌రిమానా విధిస్తామ‌ని సైబ‌రాబాద్ పోలీసులు హెచ్చ‌రించారు.

అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహ‌నాల‌ను పార్కింగ్ చేసి, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించిన‌ట్లు ప్ర‌జ‌ల దృష్టికి వ‌స్తే నేరుగా త‌మ‌కు ఫిర్యాదు చేయవచ్చ‌ని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబ‌ర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసులు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement