సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని మహిళా సంఘాలకు బెదిరింపు కాల్ వెళ్లింది. రానిపక్షంలో ప్రతీ ఒక్కరికి రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించిన ఆడియో కాల్ చక్కర్లు కొడుతోంది.
అయితే, కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ మహిళా సంఘాలకు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ సమన్వయ కార్యకర్త మహిళా సంఘాలకు ఫోన్ చేసి..‘కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వస్తారా.. లేక, ఫైన్ కడతారా?. దశాబ్ది ఉత్సవాల్లో మీరెవ్వరూ ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ కాకపోయినా మేం పట్టించుకోలేదు. మేమే వెళ్లాం.. కానీ, ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్‌కు మాత్రం మంత్రి కేటీఆర్ వస్తున్నారు.
కాబట్టి మీరంతా హాజరు కావాలి. ఒక్కో గ్రూప్ నుంచి కనీసం పది మంది రావాల్సిందే. ఎవరైనా ఒకరో, ఇద్దరో ఆరోగ్యపరంగా బాగా లేకపోతే సరేగానీ.. మిగిలిన వాళ్లంతా హాజరు కావాల్సిందే. లేకపోతే.. హాజరుకాని మహిళా సంఘాల్లో ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల జరిమానా వసూల్ చేయమని మేడమే చెప్పారని ఆమె అన్నారు. ఇక, ఈ ఫోన్ కాల్ ఇప్పుడు కరీంనగర్‌లో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. కేసీఆర్ మీద పోటీకి రెడీ
Comments
Please login to add a commentAdd a comment