అందుకు కారణం హీరోలే | samantha state forword state ments to media | Sakshi
Sakshi News home page

అందుకు కారణం హీరోలే

Published Sat, Feb 13 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

అందుకు కారణం హీరోలే

అందుకు కారణం హీరోలే

నటి సమంత లైఫ్ స్టైల్ ఎలాంటిదైనా,ఆమె మాటల్లో వాస్తవాలు ఉట్టి పడతాయి.లేని గొప్పలను తనకు ఆపాదించుకోదీ చెన్నై చిన్నది.నటినవ్వాలన్న ఆసక్తితో తోలి రోజుల్లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని నిర్భయంగా చెప్పే సమంత ఇప్పటి తన ఉన్నతికి తన కృషి,శ్రమ అని చెప్పుకున్న దాఖలాలు లేవు. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ కథానాయికల పట్టికలో చేరిన ఈ చెన్నై చందం తమిళంలో ప్రస్తుతం విజయ్‌తో తెరి, సూర్య సరసన 24 చిత్రాల్లో నటిస్తున్నారు.

త్వరలో ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లోనూ తన క్రేజ్‌ను కొనసాగించుకుంటున్న సమంత ఇటీవల ఒక సాహసాన్ని చేసి తన అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు.100 కిలోల వెయిట్‌ను ఏకంగా మూడుమార్లు పైకి లేపి దీన్ని వీడియో తీసి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేశారు. 50 కిలోల బరువు కలిగిన సమంత 100 కిలోల బరువును అవలీలగా ఎత్తడంతో అభిమానులు నివ్వెరపోయారు. దీని గురించి సమంతను అడగ్గా  స్త్రీలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అంటూ తనదైన మందహాసంతో బదులిచ్చారు. ఈ బ్యూటీ మాట్లాడుతూ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువతినన్నారు.

జీవితంలో ఇంత స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. అయితే ఈ ఉన్నతికి కచ్చితంగా తాను కారణం కాదని అన్నారు. అందుకు కారణం తనతో నటించిన కథానాయకులేనని పేర్కొన్నారు. తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు తనకు లభించాయన్నారు.ఆ చిత్రాలు విజయాలు సాధించడంతో అభిమానులకు సులభంగా చేరువయ్యానన్నారు.అదే విధంగా తనతో చిత్రాలు చేసిన దర్శకులు తన ఉన్నతికి కారణం అయ్యారని అని అన్నారు.ఇకపై కూడా మంచి కథా పాత్రలు చేస్తూ తన స్థాయిని కాపాడుకోవడానికి పోరాడతానని పేర్కొన్నారు.ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాపైనే నిమగ్నం చేస్తున్నట్లు ముద్దుగుమ్మ సమంత స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement