సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది | samantha conpleted own dubbing for theri | Sakshi
Sakshi News home page

సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది

Published Sun, Feb 28 2016 8:32 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది

సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది

ఈ జనరేషన్ హీరోలు హీరోయిన్లు ఏకంగా పాటలు పాడేస్తుంటే తాను వెనకపడిపోతానని ఫీల్ అయ్యినట్టుంది అందాల భామ సమంత. అందుకే మరీ పాటలు పాడేంత టాలెంట్ లేకపోయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యింది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత తొలి సినిమా నుంచి తన పాత్రకు చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది.

ప్రస్తుతం తమిళ్లో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న తేరి సినిమాతో తొలిసారిగా సొంతం గొంతు వినిపించనుంది ఈ బ్యూటి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేసింది జెస్సీ. తొలిసారిగా డబ్బింగ్ చెప్పడంతో యమా హ్యాపిగా ఉన్న సామ్ తన ఆనందాన్ని ట్విట్టర్లో వెల్లడించింది. సమంత తేరితో పాటు తెలుగులో అ..ఆ.., బ్రహ్మోత్సవం సినిమాల్లోనూ హీరోయిన్గా నటిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement