విజయ్ వారసురాలు రెడీ | Vijay's daughter to make her debut with Theri | Sakshi
Sakshi News home page

విజయ్ వారసురాలు రెడీ

Jan 22 2016 1:55 AM | Updated on Sep 3 2017 4:03 PM

విజయ్ వారసురాలు రెడీ

విజయ్ వారసురాలు రెడీ

హీరో, హీరోయిన్ల వారసులు చిత్ర రంగ ప్రవేశం చేయడం అన్నది సర్వసాధారణ విషయం.

 హీరో, హీరోయిన్ల వారసులు చిత్ర రంగ ప్రవేశం చేయడం అన్నది సర్వసాధారణ విషయం. కోలీవుడ్‌లోనే చాలా మంది వారసులు ఇప్పుడు వెలిగిపోతున్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్‌స్టారే తమ వారసులను చిత్ర పరిశ్రమకు అందించారు. తాజాగా ఆ తరువాత తరంలో ప్రముఖ హీరోగా రాణిస్తున్న నటుడు విజయ్ తన వారసులకు ఇప్పటి నుంచే నటనపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇంతకు ముందే కొడుకు సంజయ్‌ను తను నటించిన వేట్టైక్కారన్ చిత్రంలో ఒక పాటలో తనతో పాటు ఆడించి చిత్ర రంగానికి పరిచయం చేశారు.
 
  తాజాగా తన కూతుర్ని రంగంలోకి తీసుకురావడం విశేషం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరి చిత్రంలో నటిస్తున్నారు. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో విజయ్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముద్దుగుమ్మలు సమంతా, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. నటి మీనా కూతురు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదనపు ఆకర్షణ ఏమిటంటే ఇదే చిత్రంలో విజయ్ కూతురు నటించడం.
 
 ఇందులో విజయ్ కూతురు దివ్య ఆయన కూతురిగానే నటించిందని సమాచారం. ఇక మీనా కూతురు చిన్న ఎమీజాక్సన్‌గా నటించిదట. ఇంకో విషయం ఏమిటంటే నటుడు విజయ్ కూడా చిన్న తనంలోనే నటుడిగా రంగప్రవేశం చేసి ఇప్పుడింతటి స్థాయికి చేరుకున్నారు.పెద్ద అయిన తరువాత ఆయన వారసులు ఏ స్థాయికి చేరుకుంటారో కాలమే నిర్ణయించాలి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement