స్టార్ వారసురాలి తెరంగేట్రం | Vijay daughter set for silver screen debut | Sakshi
Sakshi News home page

స్టార్ వారసురాలి తెరంగేట్రం

Published Sat, Jan 23 2016 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

స్టార్ వారసురాలి తెరంగేట్రం

స్టార్ వారసురాలి తెరంగేట్రం

కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ వారసురాలు తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తమిళ టాప్ హీరో విజయ్ కూతురు దివ్య త్వరలోనే వెండితెర మీద సందడి చేయనుంది. అయితే హీరోయిన్గా మాత్రం కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గానే. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 59వ సినిమా థేరితో దివ్య బాలనటిగా పరిచయం అవుతోంది. రాజారాణీ ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.

ఇప్పటికే విజయ్ 49వ సినిమా వేట్టైకారన్ తో విజయ్ తనయుడు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఇలయదళపతి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే లడఖ్లో జరిగిన షూటింగ్లో విజయ్, దివ్యలు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement