తల్లి కల నెరవేర్చిన తనయ | Vijay gets closer with Meena's daughter Nainika | Sakshi
Sakshi News home page

తల్లి కల నెరవేర్చిన తనయ

Published Tue, Dec 19 2017 12:21 AM | Last Updated on Tue, Dec 19 2017 12:21 AM

Vijay gets closer with Meena's daughter Nainika - Sakshi

బేబీ మీనాని అంత సులువుగా మరచిపోలేం. బొద్దుగా, ముద్దుగా అందర్నీ ఆకట్టుకున్న మీనా కథానాయికగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు నైనిక... డాటరాఫ్‌ మీనా కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మీనా తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఆనందం రెట్టింపు అయ్యేలా నైనిక తన తల్లి కల నెరవేర్చింది. సౌత్‌లో ఎందరో హీరోలు, దర్శకులతో పని చేసిన మీనాకి తమిళ స్టార్‌ హీరో విజయ్, దర్శకుడు సిద్దిఖీతో పనిచేయాలని చిరకాల కోరిక అట. ఆ కల నెరవేరలేదు. అయితే కూతురి రూపంలో ఆ కల నెరవేరింది.

ఈ విషయాన్ని ఇటీవల మీనా స్వయంగా తెలిపారు. ‘‘విజయ్‌ హీరోగా దర్శకుడు సిద్దిఖీ గతంలో ‘ఫ్రెండ్స్‌’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో విజయ్‌కి జోడీగా చేయమని దర్శకుడు నన్ను సంప్రదించారు. బిజీ షెడ్యూల్‌ వల్ల అప్పుడు కుదరలేదు. నా కూతురు నైనిక విజయ్‌ ‘తెరి’ సినిమాలో నటించి, అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్దిఖీ దర్శకత్వం వహిస్తోన్న ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’ చిత్రంలో నైనిక నటిస్తోంది. విజయ్, సిద్దిఖీలతో పనిచేయాలనే నా కల నెరవేరలేదు. కానీ, నైనిక నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement