nainika
-
బిగ్‌బాస్ 8: ఆ హీరోయిన్‌తో పాటు డ్యాన్సర్ కూడా!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వారం రోజుల్లో షురూ కానుంది. సింగర్, మోడల్, డ్యాన్సర్, యాక్టర్.. ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్ల ఎంపిక చేపట్టారు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్య రావు, ఏక్నాథ్ హారిక, యష్మి గౌడ, అంజలి పవన్, యాంకర్ శేఖర్ భాషా, యాదమ్మరాజు దాదాపు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది.డ్యాన్సర్..తాజాగా ఓ డ్యాన్సర్ పేరు తెరపైకి వచ్చింది. తనే నైనిక. డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పాల్గొని తన టాలెంట్ చూపించింది. ఈవిడ అచ్చ తెలుగమ్మాయి. అలాగే ఓ మలయాళ హీరోయిన్ సైతం షోలోకి వచ్చేస్తోందట.. తనే విస్మయ శ్రీ. చూడటానికి క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ.. తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో, దిల్సే చిత్రాల్లో నటించింది. ప్చ్, ఫలితం లేదుఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్లో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇంతలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్ ఓకే చేసిందట. మరి ఈ బ్యూటీస్ షోలో ఏమేరకు మెప్పిస్తారో చూడాలి! -
అమ్మ గురించి అలాంటివీ రాయొద్దు.. మీనా కూతురు ఎమోషనల్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఎమోషనలయ్యారు. మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగ రిలీజ్ చేశారు. నైనిక మాట్లాడుతూ.. 'అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన తలైనా రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్, బోనీకపూర్, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్ శ్రీదేవి, ప్రభుదేవా పాల్గొన్నారు. அம்மா வந்து ஒரு Heroine ah இருக்கலாம்.. ஆனா உங்கள மாதிரி ஒரு Human தான்.. அவங்களுக்கும் Feelings இருக்கு 🥲❤️❤️ #meena #nainika #meena40 #ladysuperstar #மீனா pic.twitter.com/rYZA4Avrk2 — Kamala மீனா (@MeenaNavy) April 22, 2023 -
మీనా కూతురుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైరల్
అందాల నటి మీనా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 16) మీనా తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లి లాగే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ హీరోగా నటించిన ‘పోలీసోడు’చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత ‘భాస్కర్ ఒరు రాస్కెల్’లో అరవింద్ స్వామితోనూ నటించింది. ఇక మీనా విషయానికొస్తే శివాజీ గణేశన్ నటించిన నెంజన్ గళ్ చిత్రంలో తొలిసారి మీనా తెరపై కనిపించారు. తెలుగులో మీనా మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన సిరిపురం మొనగాడు. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బుల్లెట్ బండి: వైరల్ అవుతున్న ఎన్నారై బేబీ వీడియో
-
బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా..
నార్త్ కరోలినా: సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ పాట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. మంచిర్యాలకు చెందిన నవ వధువు సాయి శ్రీయ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త.. పా అంటూ భర్తతో డ్యాన్స్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు నైనిక అనే ఎన్నారై బేబీ సింగిల్ టేక్‌లో ఈ జానపదానికి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. లిరిక్స్ ఆలపిస్తూ.. జోష్‌గా స్టెప్పులేస్తూ పురివిప్పిన నెమలిలా వీక్షకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘నువ్వు సూపర్ బుజ్జీ.. అచ్చమైన.. స్వచ్ఛమైన పల్లె పదాలకు ఎంతో అందంగా ఆడిపాడావు. హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. జూనియర్ సాయిపల్లవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నైనిక అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నట్లు సమాచారం. -
తల్లి కల నెరవేర్చిన తనయ
బేబీ మీనాని అంత సులువుగా మరచిపోలేం. బొద్దుగా, ముద్దుగా అందర్నీ ఆకట్టుకున్న మీనా కథానాయికగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు నైనిక... డాటరాఫ్ మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మీనా తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఆనందం రెట్టింపు అయ్యేలా నైనిక తన తల్లి కల నెరవేర్చింది. సౌత్‌లో ఎందరో హీరోలు, దర్శకులతో పని చేసిన మీనాకి తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు సిద్దిఖీతో పనిచేయాలని చిరకాల కోరిక అట. ఆ కల నెరవేరలేదు. అయితే కూతురి రూపంలో ఆ కల నెరవేరింది. ఈ విషయాన్ని ఇటీవల మీనా స్వయంగా తెలిపారు. ‘‘విజయ్ హీరోగా దర్శకుడు సిద్దిఖీ గతంలో ‘ఫ్రెండ్స్’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో విజయ్‌కి జోడీగా చేయమని దర్శకుడు నన్ను సంప్రదించారు. బిజీ షెడ్యూల్ వల్ల అప్పుడు కుదరలేదు. నా కూతురు నైనిక విజయ్ ‘తెరి’ సినిమాలో నటించి, అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్దిఖీ దర్శకత్వం వహిస్తోన్న ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ చిత్రంలో నైనిక నటిస్తోంది. విజయ్, సిద్దిఖీలతో పనిచేయాలనే నా కల నెరవేరలేదు. కానీ, నైనిక నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనా. -
మల్టీ టాలెంటెడ్
మల్టీ టాలెంటెడ్ పేరు: అవంతిక వందనపు, ఊరు: హైదరాబాద్ వయసు: 11 ఏళ్లు సినిమా: ‘బహ్మోత్సవం’, ‘ప్రేమమ్’ ఫేం ‘చదువుకోవలసిన పసి పిల్లలను పనివాళ్లుగా మార్చకండి. బడికి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులను చేయకండి’ అనే ఇతివృత్తంతో రూపొందిన షార్ట్ ఫిల్మ్ ‘ప్రజా హక్కు’లో అవంతిక వందనపు ప్రధాన పాత్రలో నటించింది. బాలికల విద్య, హక్కులు, కూచిపూడి నాట్య ప్రాముఖ్యతను చర్చించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అవంతిక అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ చేయక ముందు అవంతిక సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’, నాగచైతన్య ‘ప్రేమమ్’ తదితర చిత్రాల్లో నటించిన ఈ క్యూట్ గాళ్ పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’, అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోన్న మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి పుట్టింది అమెరికాలో. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ షిఫ్టయ్యారు. మంచి యాక్టర్ మాత్రమే కాదు, డ్యాన్సర్ కూడా. ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీస్తుంది. మల్టీ టాలెంటెడ్. ఫేస్బుక్లో ఆమెకు 50 వేల మంది అభిమానులున్నారు. అమ్మకన్నా ముందే... పేరు: నైనిక, ఊరు: చెన్నై వయసు: 5 ఏళ్లు, సినిమా: ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’గా విడుదలైంది) ‘నటన మా రక్తంలోనే ఉంది’ - స్టార్ హీరోల వారసులు హీరోలుగా నటించిన సినిమాల్లో అప్పుడప్పుడూ ఇలాంటిడైలాగులు వినిపిస్తా యి. తమిళ హీరో విజయ్ ‘తెరి’లో బేబీ నైనిక నటన చూసిన తర్వాత.. ‘ఈ అమ్మాయి రక్తంలోనే నటన ఉంది’ అనడం అతి శయోక్తి కాదు. ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా కూతురు. ‘పోలీస్’లో నటించినప్పుడు నైనిక వయసు నాలుగేళ్లు. హీరో విజయ్ కూతురు నివి పాత్రలో ముద్దు ముద్దుగా నటించి, మెప్పించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ సినిమా ద్వారానే పరిచయ మయ్యారు. అప్పుడామె వయసు ఆరేళ్లు. బేబీ నైనిక అమ్మ కంటే రెండేళ్ల ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా సుమారు 45 సినిమాలు చేశారు. కానీ, కూతురు విషయంలో తొందర పడడం లేదు. నైనిక చదువుకి ఆటంకం కలగకుండా మంచి సినిమాలు వచ్చినప్పుడు ఓకే చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారట. కళ్లతోనే కనికట్టు! పేరు: హర్షాలీ మల్హోత్రా, ఊరు: ముంబై వయసు: 8 ఏళ్లు, సినిమా: ‘భజరంగీ భాయిజాన్’ మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. కళ్లతోనే నటించాలి. సంతోషం, బాధ, ఆక్రోశం.. ఏ భావమైనా కళ్లతోనే పలికించాలి! మన ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన హిందీ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’లో మూగ అమ్మాయి షాహిదాగా హర్షాలీ మల్హోత్రా చేసిన క్యారెక్టర్ ఇది. ఆరేళ్ల చిన్నారికి ఇది బరువైన పాత్ర! అందుకే, దర్శక-రచయితలు ఐదువేల మంది చిన్నారులను ఆడిషన్ చేసి, హర్షాలీను ఎంపిక చేశారు. ‘భజరంగీ భాయిజాన్’ విడుదల తర్వాత హర్షాలీ నటనను ప్రశంసించడానికి ఎవ్వరి దగ్గరా మాటల్లేవ్. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులూ అంతే. అంత అద్భుతంగా నటించింది మరి. ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులూ ఫిదా అయ్యారు. వెండితెరపై హర్షాలీ నటించిన తొలి చిత్రమిది. అంతకు ముందు మూడేళ్ల వయసులోనే రెండు సీరియళ్లలో నటించింది. ట్విట్టర్లో 15వేల మంది హర్షాలీను ఫాలో అవుతున్నారు. భాష తెలియకపోయినా... పేరు: మిఖాయిల్ గాంధీ, ఊరు: ముంబై వయసు: 6 ఏళ్లు, సినిమా: ‘సుప్రీమ్’ దర్శకుడు కట్ చెప్పగానే నటీనటులు క్యారెక్టర్ నుంచి డిస్కనెక్ట్ కావడం సహజమే. అందులోనూ ఏడుపు సన్నివేశాలైతే ఎక్కువ శాతం నటీనటులు గ్లిజరిన్ వాడుతుంటారు. బహుశా.. అతి తక్కువ మంది గ్లిజరిన్ సహాయం లేకుండా ఏడుస్తారు. అందులో మిఖాయిల్ గాంధీ ఒకడు. సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’లో రాజన్ పాత్రలో ఈ బుడ్డోడి నటన సూపర్ అన్నారంతా. షూటింగ్లో జాయిన్ అయిన ఫస్ట్‌డే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సీన్ ప్లాన్ చేశారు. సెట్లో మిఖాయిల్ అల్లరి చూసి ‘ఏం నటిస్తాడులే!’ అనుకున్న రాజేంద్రప్రసాద్, యాక్షన్ చెప్పగానే గాంధీ డైలాగ్ చెప్పిన తీరు చూసి ‘ఓరీడి దుంపతెగ’ అనకుండా ఉండలేకపోయానన్నారు. ‘‘ఎమోషనల్ సీన్లో దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా గాంధీ ఏడుస్తున్నాడు. తను హిందీ అబ్బాయి కదా, తెలుగు రాదు. చిన్న వయసులో పాత్రను అర్థం చేసుకుని, లీనమై నటించడం చిన్న విషయం కాదు’’ అని సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా తెలిపారు. -
తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!
హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చేయని సాహసం ఓ బాలనటి చేస్తోంది. తన తొలి సినిమాకే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ తేరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బాలనటిగా నటించిన నైనిక డబ్బింగ్ చెపుతున్న ఫోటోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు అట్లీ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ముద్దుల కూతురే నైనిక. మీనా కూడా బాలనటిగా తెరకు పరిచయం అందరినీ ఆకట్టుకుంది.అదే తరహాలో మీనా కూతురు నైనిక కూడా తొలి సినిమాలో నటనతోనే కాకుండా తానే డబ్బింగ్ కూడా చెపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన తేరి ఏప్రిల్ 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను పోలీసోడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. Dubbing time with Nainika was the most insteresting stage during post work pic.twitter.com/DpLRt5YZ2j — atlee (@Atlee_dir) 7 April 2016