తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది! | child artiste nainika own dubbing for theri | Sakshi
Sakshi News home page

తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!

Published Sun, Apr 10 2016 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!

తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!

హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చేయని సాహసం ఓ బాలనటి చేస్తోంది. తన తొలి సినిమాకే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ తేరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బాలనటిగా నటించిన నైనిక డబ్బింగ్ చెపుతున్న ఫోటోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు అట్లీ.
 
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ముద్దుల కూతురే నైనిక. మీనా కూడా బాలనటిగా తెరకు పరిచయం అందరినీ ఆకట్టుకుంది.అదే తరహాలో మీనా కూతురు నైనిక కూడా తొలి సినిమాలో నటనతోనే కాకుండా తానే డబ్బింగ్ కూడా చెపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన తేరి ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను పోలీసోడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement