బిగ్‌బాస్‌ 8: ఆ హీరోయిన్‌తో పాటు డ్యాన్సర్‌ కూడా! | Bigg Boss 8 Telugu: Vismaya Sri, Nainika to Participate in BB8 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 8నే నమ్ముకున్న హీరోయిన్‌.. ఆ తెలుగు బ్యూటీ కూడా!

Aug 26 2024 5:30 PM | Updated on Aug 26 2024 6:30 PM

Bigg Boss 8 Telugu: Vismaya Sri, Nainika to Participate in BB8

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ వారం రోజుల్లో షురూ కానుంది. సింగర్‌, మోడల్‌, డ్యాన్సర్‌, యాక్టర్‌.. ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్ల ఎంపిక చేపట్టారు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్య రావు, ఏక్‌నాథ్‌ హారిక, యష్మి గౌడ, అంజలి పవన్‌, యాంకర్‌ శేఖర్‌ భాషా, యాదమ్మరాజు దాదాపు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది.

డ్యాన్సర్‌..
తాజాగా ఓ డ్యాన్సర్‌ పేరు తెరపైకి వచ్చింది. తనే నైనిక. డ్యాన్స్‌ రియాలిటీ షో ఢీలో పాల్గొని తన టాలెంట్‌ చూపించింది. ఈవిడ అచ్చ తెలుగమ్మాయి. అలాగే ఓ మలయాళ హీరోయిన్‌ సైతం షోలోకి వచ్చేస్తోందట.. తనే విస్మయ శ్రీ. చూడటానికి క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ.. తెలుగులో మైల్స్‌ ఆఫ్‌ లవ్‌, కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌, నమో, దిల్‌సే చిత్రాల్లో నటించింది. 

ప్చ్‌, ఫలితం లేదు
ఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇంతలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్‌ ఓకే చేసిందట. మరి ఈ బ్యూటీస్‌ షోలో ఏమేరకు మెప్పిస్తారో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement