Nainika Bullettu Bandi Single Take Full Song Dance Video - Sakshi
Sakshi News home page

Bullet Bandi: పురివిప్పిన నెమలిలా.. నువ్వు సూపర్‌ బుజ్జీ..

Published Fri, Aug 27 2021 4:06 PM | Last Updated on Fri, Aug 27 2021 5:36 PM

Bullet Bandi Song: NRI Baby Nainika Wonderful Dance Goes Viral - Sakshi

నార్త్‌ కరోలినా: సోషల్‌ మీడియాలో బుల్లెట్‌ బండి పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ పాట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. మంచిర్యాలకు చెందిన నవ వధువు సాయి శ్రీయ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త.. పా అంటూ భర్తతో డ్యాన్స్‌ చేసిన వీడియో ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు నైనిక అనే ఎన్నారై బేబీ సింగిల్‌ టేక్‌లో ఈ జానపదానికి తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి అదరహో అనిపించింది.

లిరిక్స్‌ ఆలపిస్తూ.. జోష్‌గా స్టెప్పులేస్తూ పురివిప్పిన నెమలిలా వీక్షకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ‘‘నువ్వు సూపర్‌ బుజ్జీ.. అచ్చమైన.. స్వచ్ఛమైన పల్లె పదాలకు ఎంతో అందంగా ఆడిపాడావు. హ్యాట్సాఫ్‌’’ అంటూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. జూనియర్‌ సాయిపల్లవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నైనిక అమెరికాలోని నార్త్‌ కరోలినాలో నివసిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement