Baby Monkey Drinking Milk Listening To Bullet Bandi Song Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral: బుల్లెట్టు బండి పాటొస్తేనే.. పాలు తాగుతోంది! 

Published Thu, Aug 26 2021 11:08 AM | Last Updated on Thu, Aug 26 2021 12:54 PM

Bullet Bandi Song: Hill Monkey Drinking Milk For song At Mahabubabad - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సంతరించుకున్న ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది జంతువులకూ పాకింది. మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ(కోతి) మొబైల్‌ ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్‌ ఫోన్‌లో పాటను చూస్తూ ఆ కొండెంగ పాలు తాగడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement