Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌ | Viral Video: US Rapper DaBaby Forcibly Trying to Kiss Uninterested Fan | Sakshi
Sakshi News home page

Viral Video: మహిళా అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌

Published Sat, Apr 9 2022 1:24 PM | Last Updated on Sat, Apr 9 2022 1:32 PM

Viral Video: US Rapper DaBaby Forcibly Trying to Kiss Uninterested Fan - Sakshi

రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్స్‌కు ఫాలోవర్స్‌ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్‌ హంగామా చేస్తుంటారు.  దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు ఇస్తారు.

తాజాగా ఓ అమెరికన్‌ ర్యాపర్‌ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.  నార్త్‌ కరోలినాకు చెందిన రాపర్‌ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. 
చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన స్నేహితులు

అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్‌ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్‌ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్‌వచ్చాయి. 
చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్‌ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement