ఒకప్పుడు వరుస ప్లాపులను మూటగట్టుకున్న సుప్రీం హీరో సాయితేజ్.. ఇటీవల హిట్ ట్రాక్ ఎక్కాడు. 2019లో ‘చిత్రలహరి’లో విజయం అందుకున్న సాయితేజ్.. ఆ తర్వాత ‘ప్రతి రోజు పండుకే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ఆ హిట్స్ పరంపర కొనసాగించాడు. ప్రస్తుతం సాయితేజ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన రిపబ్లిక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సాయితేజ్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఈ యంగ్ హీరో.. గురువారం ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో సాయితేజ్ రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్నారు. ఈరోజు ఎర్త్ డే సందర్బంగా ప్రకృతితో మనం కలిసి జీవించాలంటూ సాయితేజ్ ఆ ఫోటోలను షేర్ చేశాడు.
This #EarthDay let’s take a simple oath of “LIVE AND LET LIVE” ...let’s be a little more compassionate towards our nature. pic.twitter.com/wpA5daMNwd
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2021
చదవండి:
విశాఖ స్టీల్ ప్లాంట్’పై చిరంజీవి సంచలన ట్వీట్
కరోనాతో డ్రైవర్ మృతి.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ!
Comments
Please login to add a commentAdd a comment