![Sai Dharam Tej Solo Brathuke So Better Locks Christmas - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/11/29/SBSB-DATED-plain-still.jpg.webp?itok=WxkerKga)
సాయిధరమ్ తేజ్, నభా నటేశ్
సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కరోనా వల్ల మూతబడిన థియేటర్లు రీ ఓపెన్ అయ్యాక విడుదల కానున్న పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.
ఈ సందర్భంగా సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘ఇన్ని రోజులూ మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటానికి క్రిస్మస్‌కు వస్తున్నాం. మీ (ప్రేక్షకులు) ఈలలు.. గోలలు వినడానికి చాలా ఎదురు చూస్తున్నాం. కలసి నవ్వుకుందాం’’ అన్నారు. ‘‘క్రిస్మస్ పండగకు మా సినిమా రావటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment