గెటింగ్‌ రెడీ  | Megastar Chiranjeevi Workout In Gym For Vishwambhara Movie, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Chiranjeevi Gym Video: గెటింగ్‌ రెడీ 

Published Fri, Feb 2 2024 5:33 AM | Last Updated on Fri, Feb 2 2024 10:06 AM

Chiranjeevi Workout In Gym For Vishwambhara Movie - Sakshi

‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు హీరో చిరంజీవి. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. కాగా ఈ పాత్రకు సంబంధించిన మేకోవర్‌ కోసం చిరంజీవి కసరత్తులు చేస్తున్నారు. ‘గెటింగ్‌ రెడీ ఫర్‌ విశ్వంభర’ అంటూ తన వర్కౌట్స్‌ వీడియోను షేర్‌ చేశారు చిరంజీవి. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది.

అయితే ముందు చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్స్‌లో ఈ నెల నుంచి ‘విశ్వంభర’ షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: ఎమ్‌ఎమ్‌ కీరవాణి, కెమెరా: చోటా కే నాయుడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement