మాటలు ఆరంభం | Dubbing work for Megastar Chiranjeevi Vishwambhara begins | Sakshi
Sakshi News home page

మాటలు ఆరంభం

Published Fri, Jul 5 2024 4:44 AM | Last Updated on Fri, Jul 5 2024 4:44 AM

Dubbing work for Megastar Chiranjeevi Vishwambhara begins

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ డబ్బింగ్‌ పనులు షురూ అయ్యాయి. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.

అందుకు తగ్గట్టు ఓ వైపు షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు మొదలుపెట్టింది చిత్రబృందం. గురువారం మాటల (డబ్బింగ్‌) పనులను ప్రారంభించారు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీగా ‘విశ్వంభర’ రూపొందుతోంది.

ఈ చిత్రంలో హనుమాన్‌ భక్తుడిగా కనిపిస్తారు చిరంజీవి. యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులకు ఎక్కువ టైమ్‌ పడుతుంది. అందుకేప్రోడక్షన్, పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులను ఏకకాలంలో చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement