తండ్రి అయిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ | Vishwambhara Movie Director Vasishta Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Director Vasishta: బిడ్డకు జన్మనిచ్చిన దర్శకుడు వశిష్ఠ భార్య

Published Tue, Feb 6 2024 2:09 PM | Last Updated on Tue, Feb 6 2024 3:05 PM

Vishwambhara Movie Director Vasishta Blessed With Baby Girl - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా తీసిన అనుభవమున్న దర‍్శకుడు వశిష్ఠ.. దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ త్రిష గురించి రీసెంట్‌గానే అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇలా అంతా సాఫీగా జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఓ గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దర్శకుడు వశిష్ఠ తండ్రి అయ్యాడు.

(ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన)

వశిష్ఠ అసలు పేరు వేణు. తం‍డ్రి నిర్మాత కావడంతో 'ప్రేమలేఖ' అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క చిత్రంతో ఇక నటనకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. చాలా ఏళ్ల తర్వాత 'బింబిసార' అనే చిత్రంతో దర్శకుడిగా మారిపోయాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. వశిష్ఠకు మెగా ఛాన్స్ వచ్చేలా చేసింది.

ప్రస్తుతం చిరుతో 'విశ్వంభర' సినిమా చేస్తూ వశిష్ఠ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి భార్య సుజాత ప్రెగ్నెన్సీ ఉంది. సోమవారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ విషయం ఎవరూ బయటకు చెప్పలేదు. పాప పుట్టడం గురించి దర్శకుడు వశిష్ఠ అందరూ తెలియజేయాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement