చిరంజీవి కొత్త సినిమాకు ఊహించని సమస్య? | Chiranjeevi Viswambhara Movie Shooting Latest Update Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'విశ్వంభర' షూటింగ్ చకచకా.. కానీ అది మాత్రం!

Published Sun, Mar 3 2024 4:17 PM | Last Updated on Sun, Mar 3 2024 6:14 PM

Chiranjeevi Viswambhara Movie Shooting Updates Latest - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. 'భోళా శంకర్' ఫ్లాప్‌తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది. దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. షూటింగ్ అంతా బాగానే నడుస్తోంది కానీ ఊహించని విధంగా ఓ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి.. సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ రేంజుకి తగ్గ హిట్ అయితే పడట్లేదు. 'వాల్తేరు వీరయ్య'గా గతేడాది సంక్రాంతికి సక్సెస్ అందుకున్నప్పటికీ.. 'భోళా శంకర్' వల్ల కథ మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్‌తో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది)

'విశ్వంభర'లో హీరోయిన్‌గా త్రిష చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో చిరుకు ఏకంగా ఐదుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ తదితరులు ఈ పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వీళ్లకు జోడీలుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చిత్రబృందం తర్జనభర్జనా పడుతోందట. సుశాంత్, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు పలువురు పరిశీలనలో ఉన్నప్పటికీ ఫైనల్‌గా ఎవరు సెట్ అవుతారనేది చూడాలి.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'విశ్వంభర' సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అధికారికంగా ప్రకటించేశారు కూడా. కీరవాణి సంగీతమందిస్తుండగా.. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. 

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement