సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా? | Ajith Good Bad Ugly Movie Release On Sankranti 2025 | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌కి పోటీగా తమిళ స్టార్ హీరోని దింపుతున్న మైత్రీ

Published Thu, Mar 14 2024 9:11 PM | Last Updated on Thu, Mar 14 2024 9:34 PM

Ajith Good Bad Ugly Movie Release On Sankranti 2025 - Sakshi

మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. 

(ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్)

ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్‌ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్‍‌కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. 

అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్‌కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్.

(ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement