
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ప్రోడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ శంకర్‌పల్లిలో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ పాట కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ యాంథమ్‌ను కంపోజ్ చేయగా, శోభి మాస్టర్ నృత్య రీతులను సమకూర్చుతున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి స్టైలిష్ లుక్‌ను రిలీజ్ చేశారు.
‘‘యాక్షన్, ఎమోషన్‌లతో పాటు విజువల్ వండర్‌లా ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకు చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment