
ఎలక్షన్లు, కలెక్షన్లు వారికి అలవాటు:విజయశాంతి
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయశాంతి
మెదక్ , న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ దొంగల పార్టీ అని, ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లేనని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి విమర్శించారు. బుధవారం ఆమె మెదక్ మండలంలోని ముత్తాయికోట, పోచంపల్లి, ఫరీద్‌పూర్, పోచమ్మరాల్, జక్కన్నపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ కేవలం ఎలక్షన్లు, కలెక్షన్లకు అలవాటు పడిందన్నారు. జక్కన్నపేటలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరికి వారు జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న విజయశాంతి ఆవేశంతో ఊగిపోయారు. అసలు టీఆర్‌ఎస్ వాళ్లకు మ్యానర్స్ ఉందా? అని ఘాటుగా స్పందించారు.