
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్‌ఛార్జ్‌ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. (పాతగూటికి ‘రాములమ్మ’?)
విజయశాంతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కుసుమ కుమార్
Comments
Please login to add a commentAdd a comment