kusuma kumar
-
విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్ఛార్జ్ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. (పాతగూటికి ‘రాములమ్మ’?) విజయశాంతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కుసుమ కుమార్ -
ఎవరికీ వారే యమునా తీరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34 చోట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇన్చార్జులు లేకుండా పోయారు. పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు, ఓడిపోయిన వారితోపాటు గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు సీట్లు ఇచ్చిన చోట ఉన్న నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారికంగా బాధ్యతలు తీసుకునే నాయకులే లేకుండా పోయారు. ఈ స్థానాల్లో కంగాళీ పరిస్థితులు ఏర్పడి నెలలు గడుస్తున్నా అక్కడ ఇన్చార్జులుగా ఎవరిని నియమించాలన్న దానిపై టీపీసీసీ పెద్దలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ఆయా స్థానాల్లో ఇన్చార్జి బాధ్యతలు ఆశిస్తున్న నేతలతోపాటు క్షేత్రస్థాయి కేడర్‌లోనూ నైరాశ్యం నెలకొంది. జంపింగ్‌ల స్థానాలపై స్పష్టతేదీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), బానోతు హరిప్రియ (ఇల్లెందు), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), విష్ణువర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), కె.ఉపేందర్‌రెడ్డి (పాలేరు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు)లు టీఆర్ఎస్లో చేరిపోయారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీతో విభేదించి దూరంగా ఉంటున్నారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అధికారికంగా పార్టీ ఇన్చార్జులను నియమించలేదు. దీంతో తమ నేత ఎవరో అర్థంగాక స్థానిక కేడర్ తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా స్థానాల్లో పార్టీ బాధ్యతలు చూడాలని అంతర్గతంగా కొందరికి సమాచారం ఇచ్చినా ఫలానా నియోజకవర్గానికి ఫలానా నాయకుడు ఇన్చార్జి అనే ఉత్తర్వులు లేకపోవడంతో ఇన్చార్జి స్థానాలు ఆశిస్తున్న నేతలు కూడా సమన్వయంతో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడా అయోమయమే.. ఎమ్మెల్యేలే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు, పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు పోటీ చేసిన స్థానాల్లో అప్పటివరకు కాంగ్రెస్ ఇన్చార్జులుగా ఉన్న నేతల్లో కొందరు అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఈ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు ఉన్నా ఇంకా వారికి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అక్కడ పార్టీ ఇన్చార్జి కోసం ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో సునీతపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 5 వేల ఓట్లు సాధించిన లక్ష్మీ రవీందర్‌రెడ్డితోపాటు రాజారెడ్డి అనే నేత పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షాద్‌నగర్‌లో పోటీ చేసిన ప్రతాప్‌రెడ్డి స్థానంలో రాజు యాదవ్, దేవరకద్రలో పవన్‌కుమార్‌రెడ్డి స్థానంలో ప్రదీప్‌గౌడ్, హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి స్థానంలో బొమ్మా శ్రీరామ్‌చక్రవర్తి, ఆలేరులో బూడిద భిక్షమయ్యగౌడ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్‌ల పేర్లు వినిపిస్తున్నా వారికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కేఎస్ రత్నం స్థానంలో చేవెళ్ల నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించామని చెబుతున్నా అక్కడా అధికారిక ఉత్తర్వుల్లేవు. అదే విధంగా వైరా, మానకొండూరు, మెదక్, రాజేంద్రనగర్, సత్తుపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు, ఇతర పార్టీలు పోటీ చేసిన మరికొన్ని స్థానాలు కలసి మొత్తం 34 చోట్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఏం చేయాలన్న దానిపై ఇటీవల జరిగిన టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఏం చేయాలన్న దానిపై టీపీసీసీ పెద్దలు నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. చర్చించాం.. నిర్ణయం తీసుకుంటాం రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జుల నియామకంపై కోర్ కమిటీ చర్చించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు లేని చోట నేరుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తాం. ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్న స్థానాల్లో ఐదుగురితో కలసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఇన్చార్జి పోస్టు ఆశిస్తున్న వారిని కన్వీనర్లుగా, ఇతరులను సభ్యులుగా నియమిస్తాం. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. – జెట్టి కుసుమ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
‘అవినీతిని ఓడిద్దాం.. గుణపాఠం చెబుదాం’
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్‌లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ అన్నారు. ‘హుజూర్‌నగర్‌లో అవినీతిని ఓడిద్దాం... కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అని పిలుపునిచ్చారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయం పూర్తిగా రైతులకు అందలేదని, యూరియా కొరతను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్‌లకు అధికారాలు, నిధులు లేవని మండిపడ్డారు. ఓ గిరిజన సర్పంచ్ తన బాధలను లేఖ ద్వారా బహిర్గతం చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల జేబులు నిండే పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ చెప్తోన్న సర్వేలన్నీ బూటకమని కొట్టిపారేశారు. హుజూర్నగర్ కాంగ్రెస్ కంచుకోట ప్రజాసమస్యలపై పోరాడిన ఉత్తమ్ పద్మావతి కావాలో, అవినీతి పరుడు, మంత్రి జగదీష్ రెడ్డి బినామీ సైదిరెడ్డి కావాలో హుజూర్నగర్ ప్రజలు నిర్ణయించుకోవాలని కుసుమ కుమార్ విఙ్ఞప్తి చేశారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, జానారెడ్డిలు సైతం ప్రచారానికి వస్తారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో అడుగు పెడుతుంది అని పేర్కొన్నారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో ముందుకు వెళ్లినా చివరికి మిగిలింది తొమ్మిదే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ‘వికారినామ సంవత్సరానికి రాజు శని. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయి. పాలకుల మధ్య వైరం ఉంటుంది. పాలకులు, ప్రజలు రోగాలతో బాధపడతారు. పంటలు స్వల్పంగా పండుతాయి. దేశం, రాష్ట్రంలో పాలకులు, ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజలకు మేలు జరగదు. దేశం, రాష్ట్రంలో అస్థిర రాజకీయ వాతావరణం ఉంటుంది. దేశ ఆదాయం 45 కాగా ఖర్చు 65గా ఉంటుంది. ఆర్థిక వనరులు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. స్వదేశీ పారిశ్రామిక కంపెనీల్లో నకిలీ ఔషధాలు బయటపడతాయి. సాంకేతిక, సమాచార రంగంలో నూతన పోకడలతో యువత ప్రమాదాలను ఎదుర్కొంటారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కుమార్ రావు, కోదండరెడ్డి, వినోద్‌కుమార్, వినోద్ రెడ్డి, జి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ.. కల్వకుంట్ల సామ్రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత కుసుం కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమా లేక కల్వకుంట్ల సామ్రాజ్యామా అంటూ ప్రశ్నించారు. తాలీబన్ వ్యవస్థలా తెలంగాణను పాలిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుసుమ కుమార్ పాల్గొన్నారు. పోలింగ్ బూతుల్లో టీఆర్ఎస్కు ఏజెంట్లు అవసరం ఉండకపోవచ్చని.. అధికారులనే పోలింగ్ ఏజెంట్లుగా టీఆర్ఎస్ వాడుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మల్లా ఉండొద్దని పోలీసులను హెచ్చరించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సహారా సంస్థ ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) నిధులు వాడుకునేందుకూ అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్ అనుమతిచ్చారని.. దీంతో సహారా సంస్థ మూతపడిన తర్వాత పదకొండు లక్షల ఉద్యోగులు రోడ్డునపడ్డారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్‌ను సీబీఐ రెండు సార్లు విచారించిందన్నారు. ఈ కేసుకు భయపడే ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ సరెండర్ అయ్యారని విమర్శించారు. సీబీఐ కేసులో లేనని కేసీఆర్ నిరూపిస్తే.. ఆయన ఫామ్‌హౌస్ ముందు కాపలా కుక్కలా ఉంటానని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రజాకూటమి రావడం ఖాయమని, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. -
‘సెటిలర్స్ పదాన్ని నిషేధించాలి’
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్ బాధ్యతలు చేపట్టారు. భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపైన అభిమానంతో రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. చంద్రబాబును పదే పదే విమర్శిస్తున్న కేసీఆర్‌ను.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా అని ప్రశ్నించారు. తరతరాలుగా తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలను సెటిలర్స్ అనటాన్ని ఆయన తప్పుబట్టారు. సెటిలర్స్ అనే పదాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అది దేశంలో కేసీఆర్ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. గెలిపించకుంటే ఫార్మ్‌హౌస్‌లో పడుకుంటా అంటున్నారని, డిసెంబర్ 7 తరువాత కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కే వెళ్లాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రులను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసి ప్రభావితం చేసిందని ఆరోపించారు. -
త్వరలో తెలంగాణ పీసీసీ
ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే సీఎం అవుతారు... పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి కుసుమకుమార్ వైరా, న్యూస్‌లైన్ : తెలంగాణకు త్వరలో ప్రత్యేక పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని, దీనిపై నాలుగు రోజుల్లో ప్రకటన వస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్ జట్టి కుసుమకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన వైరాలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని, ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు వేశామని, ఇన్‌చార్జ్‌లను కూడా నియమించామని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం గురించి విలేకరులు ప్రశ్నించగా, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ పెడితే నష్టం ఏమీ లేదని, పార్టీ పెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వైరా నియోజకవర్గానికి 22 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారని, గెలిచినవారికి టికెట్లు ఇస్తామన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మిగిలిన ఆధునికీకరణ పనులకు నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాగుబండి రాంబాబు, పసుపులేటి మోహన్‌రావు, కోప్పురావూరి సుమంత్, శీలం వెంకటనర్సిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.