ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే సీఎం అవుతారు...
పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి కుసుమకుమార్
వైరా, న్యూస్‌లైన్ :
తెలంగాణకు త్వరలో ప్రత్యేక పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని, దీనిపై నాలుగు రోజుల్లో ప్రకటన వస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ జట్టి కుసుమకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన వైరాలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని, ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు వేశామని, ఇన్‌చార్జ్‌లను కూడా నియమించామని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం గురించి విలేకరులు ప్రశ్నించగా, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ పెడితే నష్టం ఏమీ లేదని, పార్టీ పెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వైరా నియోజకవర్గానికి 22 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారని, గెలిచినవారికి టికెట్లు ఇస్తామన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మిగిలిన ఆధునికీకరణ పనులకు నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాగుబండి రాంబాబు, పసుపులేటి మోహన్‌రావు, కోప్పురావూరి సుమంత్, శీలం వెంకటనర్సిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.
త్వరలో తెలంగాణ పీసీసీ
Published Wed, Feb 26 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement