సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్ బాధ్యతలు చేపట్టారు. భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపైన అభిమానంతో రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. చంద్రబాబును పదే పదే విమర్శిస్తున్న కేసీఆర్‌ను.. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా అని ప్రశ్నించారు. తరతరాలుగా తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలను సెటిలర్స్ అనటాన్ని ఆయన తప్పుబట్టారు.
సెటిలర్స్ అనే పదాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అది దేశంలో కేసీఆర్ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. గెలిపించకుంటే ఫార్మ్‌హౌస్‌లో పడుకుంటా అంటున్నారని, డిసెంబర్ 7 తరువాత కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కే వెళ్లాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రులను టీఆర్‌ఎస్ భయభ్రాంతులకు గురిచేసి ప్రభావితం చేసిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment