
జగ్గారెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 31న హైదరాబాద్ రానున్నారు.
హైదరాబాద్: గతేడాది మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థంపుచ్చుకొని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి సొంతగూటి కి రానున్నారు. ఈనెల 31వ తేదీన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
దీనిలో భాగంగా అదే రోజు హైదరాబాద్ కు రానున్న దిగ్విజయ్ సింగ్ .. రెండు రోజుల పాటు నగరంలో ఉండి ఏపీ, తెలంగాణ నేతల పనితీరుపై సమీక్షించనున్నారు.