సోనియాకు క్షమాపణ చెబుతున్నా.. | Jaggareddy apologises to sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాకు క్షమాపణ చెబుతున్నా..

Published Thu, Jul 30 2015 2:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సోనియాకు క్షమాపణ చెబుతున్నా.. - Sakshi

సోనియాకు క్షమాపణ చెబుతున్నా..

తాను భారతీయ జనతా పార్టీలో చేరడం చారిత్రక తప్పిదమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీలో చేరటం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : తాను భారతీయ జనతా పార్టీలో చేరడం చారిత్రక తప్పిదమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీలో చేరటం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి గురువారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్తో గాంధీభవన్లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్ పార్టీని వీడినందుకు  సోనియాగాంధీకి క్షమాపణ చెబుతున్నానన్నారు. ఇక మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు మెదక్ జిల్లా నేతలు అంగీకరించారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement