రేపు హైదరాబాద్ రానున్న దిగ్విజయ్ | Digvijay to visit Hyderabad on Wednesday | Sakshi
Sakshi News home page

రేపు హైదరాబాద్ రానున్న దిగ్విజయ్

Published Tue, Jun 14 2016 4:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Digvijay to visit Hyderabad on Wednesday

హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం ఆయన గాంధీభవన్‌లో పార్టీ సమన్వయ కమిటీ నేతలతో సమావేశమవ్వనున్నారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం ఆయన ఆదిలాబాద్ వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement