మాయమాటలతో పీఠమెక్కిన కేసీఆర్ | kcr got power to cheat to people : jagga reddy | Sakshi
Sakshi News home page

మాయమాటలతో పీఠమెక్కిన కేసీఆర్

Published Thu, Sep 11 2014 12:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

kcr got power to cheat to people : jagga reddy

నంగునూరు: ‘ప్రజలకు కల్లబొల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నాడ’ని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని ముండ్రాయిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా రాజగోపాల్‌పేట, పాలమాకుల, రాంపూర్, నంగునూరు, సిద్దన్నపేట, బద్దిపడగలో రోడ్‌షో నిర్వహించి తనను గెలిపించాలని కోరారు. అనంతరం బద్దిపడగలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రతీ ఇంటికి మంజీర నీటిని ఇప్పించడంతో పాటు సిద్దిపేటకు రైల్వే మార్గం వేయిస్తానన్నారు.

ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఏడు గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం మూడు గంటలైనా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకానైనా ప్రవేశపెట్టాడా..? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వం, బీజేపీది చేతల ప్రభుత్వం అన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, భూపేశ్, యాదమల్లు, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, భూపాణి, చంద్రం, రాజుగౌడ్, చంద్రం, పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతిరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


 గెలిపిస్తే రైల్వే లైన్ తెస్తా....
 సిద్దిపేట రూరల్: తనను గెలిపిస్తే సిద్దిపేటకు రైల్వే లైన్ తెస్తాననని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేట, రాఘవాపూర్, చిన్నగుండవెల్లిలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రైల్వే లైన్ తేవడం తమతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement