
'జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాదు'
లోక్సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీచేస్తున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కి మెదక్ స్థానంలో డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.
లోక్సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీచేస్తున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కి మెదక్ స్థానంలో డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అక్కడ తమ సొంత పార్టీ తరఫున పోటీ చేయించడానికి అభ్యర్థి దొరక్క భారతీయ జనతా పార్టీ కిరాయి అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే మెదక్లో తమను గెలిపిస్తాయని కర్నె ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.