
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను ఎందుకు వెళ్లలేదన్న అంశంపై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తనదైన శైలిలో బదులి చ్చారు. తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కరీంనగర్ పార్లమెంటు ఇన్‌చార్జిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున ప్రచారానికి వెళ్లలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.
అందుకు కారణం తన దగ్గ ర డబ్బులు లేకపోవడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు చెరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, డబ్బులు లేకుండా తాను వెళ్లి అక్కడ ఏం చేయలేను కనుకనే ప్రచారానికి వెళ్లలేకపోయానని జగ్గారెడ్డి తెలిపారు.