
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో ఇంటికో ఓటును కాంగ్రెస్‌కు వేసే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నేతలు, హుజూరాబాద్ ఎన్నికల ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలతో రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. వచ్చే వారం రోజులపా టు అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై నాయకులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. బీజే పీ, టీఆర్‌ఎస్‌ల మోసపూరిత విధానాలు వివరించాలన్నారు.
బీజేపీ–టీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందాలు బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎ న్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభా కర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment