హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌తో కొట్లాడి గెలిచానని చెప్పారు.
తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని అన్నారు.
ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు..
Comments
Please login to add a commentAdd a comment