సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్ శ్రమించలేదని మండిపడుతున్నారు.
(చదవండి: దక్షిణ తెలంగాణకు మరణశాసనం: రేవంత్ )
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు.
(చదవండి: గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు)
మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్ వెంకట్‌ని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment