
ములుగు జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు.
భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వమని, ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని పేర్కొన్నారు. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment