సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత తూర్పు జయప్రకాస్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై 2589 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగ్గారెడ్డి 2004లో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచి కాంగ్రెస్ ఐలో చేరారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి విప్ అయ్యారు.
తదుపరి మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బిజెపి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఐ లోకి వచ్చి అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. జగ్గారెడ్డికి 76572 ఓట్లు రాగా, చింతా ప్రభాకర్‌కు 73983 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన రాజేశ్వరరావు దేశ్ పాండేకి 7600 పైగా ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలో పదకుండు సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా, రెండుసార్లు బిసి నేతలు విజయం సాధించారు.
ఒకసారి ఎస్.సి, మరోసారి బ్రాహ్మణ నేత గెలు పొందారు. ఇక్కడ మొత్తం కాంగ్రెస్, కాంగ్రెస్‌లు కలిసి ఆరుసార్లు గెలిస్తే, టిడిపి ఒకసారి, రెండుసార్లు టిఆర్‌ఎస్ గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. సంగారెడ్డిలో అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన ఘనత పి.రామచంద్రారెడ్డికి దక్కింది. ఈయన 1989లో కొంతకాలం స్పీకర్‌గాను, మరికొంత కాలం నేదురుమల్లి క్యాబినెట్‌లో మంత్రిగాను పనిచేసారు. 2004లో ఈయన బిజెపి తరుపున లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment