Sangareddy Assembly Constituency
-
సంగారెడ్డి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన.. ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా. 90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: కేసీఆర్ దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ కరివేపాకు! -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత తూర్పు జయప్రకాస్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై 2589 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగ్గారెడ్డి 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కాంగ్రెస్ ఐలో చేరారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి విప్ అయ్యారు. తదుపరి మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బిజెపి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఐ లోకి వచ్చి అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. జగ్గారెడ్డికి 76572 ఓట్లు రాగా, చింతా ప్రభాకర్‌కు 73983 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన రాజేశ్వరరావు దేశ్ పాండేకి 7600 పైగా ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలో పదకుండు సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా, రెండుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి ఎస్.సి, మరోసారి బ్రాహ్మణ నేత గెలు పొందారు. ఇక్కడ మొత్తం కాంగ్రెస్, కాంగ్రెస్‌లు కలిసి ఆరుసార్లు గెలిస్తే, టిడిపి ఒకసారి, రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. సంగారెడ్డిలో అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన ఘనత పి.రామచంద్రారెడ్డికి దక్కింది. ఈయన 1989లో కొంతకాలం స్పీకర్‌గాను, మరికొంత కాలం నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రిగాను పనిచేసారు. 2004లో ఈయన బిజెపి తరుపున లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..