మీ బ్రేస్‌లెట్‌ను ఇచ్చేయండి: రాహుల్‌గాంధీ
మీ బ్రేస్‌లెట్‌ను ఇచ్చేయండి: రాహుల్‌గాంధీ
Published Fri, Jun 2 2017 4:22 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
వీహెచ్ తో రాహుల్ సరదా సంభాషణ
సంగారెడ్డి: 'జగ్గారెడ్డి గట్టోడు.. మొండోడు.. వన్‌మెన్ షో చేసిండు. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టుకుని ఏర్పాట్లు చేసిండు..' అంటూ ఎంపీ వి. హనుమంతరావు ప్రజాగర్జన ఏర్పాట్ల గురించి వేదికపై రాహుల్ వద్ద పొగడ్తలు గుప్పించారు. దీంతో ' సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారు' అని రాహుల్ ప్రశ్నించగా..' నా దగ్గరేముంది ఇచ్చేందుకు..' అని వీహెచ్ బదులిచ్చారు. దీంతో రాహుల్ సరదాగా ..' మీ చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ను జగ్గారెడ్డికి ఇచ్చేయండి' అన్నారు. ఈ వ్యాఖ్యలతో జగ్గారెడ్డితో పాటు వీహెచ్, ఉత్తమ్ తదితరులు ఒక్కసారిగా నవ్వేశారు.
Advertisement
Advertisement